అంతా కొత్తవారితో చంద్రశేఖర్ యేలేటి తాజా సినిమా.

అంతా కొత్తవారితో చంద్రశేఖర్ యేలేటి తాజా సినిమా.

Published on Nov 4, 2014 3:58 PM IST

chandra-shekar-yeleti
‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో, ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ గా విమర్శకుల నుండి ప్రసంశలు అందుకున్నాడు.

తన తదుపరి సినిమా అంతా కొత్తవారితో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చంద్రశేఖర్ యేలేటి చెప్పారు. ప్రస్తుతం ప్రీ – ప్రొడక్షన్ వర్క్స్ లో దర్శకుడు బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు ప్రకటిస్తాం అని ఈ ప్రయోగాత్మక, విలక్షణ సినిమాల దర్శకుడు కన్ఫర్మ్ చేశారు.

విక్టరీ వెంకటేష్ హీరోగా వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించే సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తారు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. రెండు మూడు రోజులుగా మీడియాలో షికారు చేస్తున్న ఈ పుకారుకు తాజా స్టేట్మెంట్ తో దర్శకుడు చెక్ పెట్టినట్టు అయ్యింది.

తాజా వార్తలు