క్రిస్మస్ కి టాలీవుడ్ వేడెక్కనుంది!!

క్రిస్మస్ కి టాలీవుడ్ వేడెక్కనుంది!!

Published on Dec 9, 2015 1:24 PM IST

movies
ప్రతి వారం తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద కచ్చితంగా ఒక్క సినిమా అన్నా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి చిన్న సినిమాలు అయితే రెండు మూడు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. 2015 ఏడాది చివరికి చేరుకున్నాం. దీంతో 2105 చివర్లో చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్దమై బాక్స్ ఆఫీసు వద్ద వేడిని పెంచేస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారం, క్రిస్మస్ కానుకగా ఒకేసారి 5 సినిమాలు రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నాయి. అలా అని చిన్న చితకా సినిమాలు రావడం లేదు. క్రేజున్న యంగ్ హీరోల సినిమాలే రిలీజ్ అవుతుండడం విశేషం.

క్రిస్మస్ సీజన్ లో విడుదల కానున్న సినిమాల గురించి చెప్పుకుంటే.. మాచో హీరో గోపిచంద్ – రేజీన జంటగా నటించిన సౌఖ్యం సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. మోహన్ బాబు – అల్లరి నరేష్ కాంబినేషన్ లో రానున్న ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది. తేజస్వి – వారాహి చలన చిత్రం బ్యానర్ సమర్పణలో వస్తున్న జత కలిసే కూడా డిసెంబర్ 25నే రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు 25న రిలీజవుతుంటే దీనికంటే ఒక్క రోజు ముందు అనగా 24న మరో మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సూర్య హీరోగా వస్తున్న డబ్బింగ్ మూవీ ‘మేము’, సుదీర్ బాబు నటించిన ‘భలే మంచి రోజు’, నాగ శౌర్య నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాలు 24న రిలీజ్ కానున్నాయి. ఇలా 6 సినిమాలతో 2015 చివరి వారం బాక్స్ ఆఫీసు వద్ద హాట్ హాట్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు