ఐమ్యాక్స్ హిస్టరీ లోనే ‘ది ఒడిస్సీ’ సంచలన రికార్డు!

The Odyssey Review

ఈ ఏడాది హాలీవుడ్ నుంచి ప్రథమార్ధం అంతా చాలా చప్పగా సాగింది. కానీ జూన్ నెల తర్వాత నుంచి మాత్రం హాలీవుడ్ నుంచి వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేశాయి. అలా వచ్చిన చిత్రాల్లో లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘ది ఒడిస్సీ’ కూడా ఒకటి.

ప్రత్యేకంగా ఐమ్యాక్స్ వెర్షన్ లోనే తెరకెక్కించిన ఈ చిత్రానికి ఈ ఫార్మాట్ లో నెలకొన్న క్రేజ్ చూసి అంతా షాకయ్యారు. ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్స్ ఓపెన్ చేస్తే రికార్డు హౌస్ ఫుల్స్ ఈ చిత్రం సెట్ చేసింది. ఇలా థియేటర్స్ లో విడుదల అయ్యాక ఏకంగా రెండు నెలల వరకు ప్రపంచ దేశాల్లో ఐమ్యాక్స్ టికెట్స్ మిగల్లేదు.

ఇలా నోలన్ సినిమా ఐమ్యాక్స్ చరిత్రలోనే ఒక సంచలన రికార్డు సెట్ చేసినట్టు ఐమ్యాక్స్ వారు అధికారికంగా ధృవీకరించారు. ఇప్పుడు వరకు వచ్చిన ఐమ్యాక్స్ రిలీజ్ లలో ఈ సినిమానే అత్యధిక గ్రాసర్ గా నిలిచినట్టు వారు ప్రకటించారు. దీనితో ది ఒడిస్సీ చిత్రం పేరిట సంచలన రికార్డు సెట్ అయ్యింది అని చెప్పవచ్చు.

Exit mobile version