ఈ ఏడాది హాలీవుడ్ నుంచి ప్రథమార్ధం అంతా చాలా చప్పగా సాగింది. కానీ జూన్ నెల తర్వాత నుంచి మాత్రం హాలీవుడ్ నుంచి వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేశాయి. అలా వచ్చిన చిత్రాల్లో లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘ది ఒడిస్సీ’ కూడా ఒకటి.
ప్రత్యేకంగా ఐమ్యాక్స్ వెర్షన్ లోనే తెరకెక్కించిన ఈ చిత్రానికి ఈ ఫార్మాట్ లో నెలకొన్న క్రేజ్ చూసి అంతా షాకయ్యారు. ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్స్ ఓపెన్ చేస్తే రికార్డు హౌస్ ఫుల్స్ ఈ చిత్రం సెట్ చేసింది. ఇలా థియేటర్స్ లో విడుదల అయ్యాక ఏకంగా రెండు నెలల వరకు ప్రపంచ దేశాల్లో ఐమ్యాక్స్ టికెట్స్ మిగల్లేదు.
ఇలా నోలన్ సినిమా ఐమ్యాక్స్ చరిత్రలోనే ఒక సంచలన రికార్డు సెట్ చేసినట్టు ఐమ్యాక్స్ వారు అధికారికంగా ధృవీకరించారు. ఇప్పుడు వరకు వచ్చిన ఐమ్యాక్స్ రిలీజ్ లలో ఈ సినిమానే అత్యధిక గ్రాసర్ గా నిలిచినట్టు వారు ప్రకటించారు. అయితే ఈ మాసివ్ ఫీట్ తర్వాత నిన్న ఆగష్టు 14న చైనాలో ఈ సినిమా ఏకంగా 20 వేల స్క్రీన్స్ లో విడుదలైంది.
ఇంట్రెస్టింగ్ గా అక్కడ ఉన్న ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో 90 శాతం ఈ సినిమాకే కేటాయించబడినట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ భారీ రికార్డు సెట్ చేసిన ఈ చిత్రం ఐమ్యాక్స్ వెర్షన్ లో మరో బిగ్గెస్ట్ ఫీట్ ని సెట్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ గా ఒడిస్సీ హవా ఐమ్యాక్స్ వెర్షన్ లో ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
History. Made. 🙌#TheOdysseyMovie is the highest-grossing IMAX film of all time. More showtimes added. Don't miss the epic, now playing in IMAX. #ShotEntirelyWithIMAXFilmCameras pic.twitter.com/vBYD0UloDC
— IMAX (@IMAX) August 14, 2026
