చూసి చూడంగానే ఫస్ట్ లుక్ విడుదల

Published on Aug 19, 2019 10:00 am IST

శివ కందుకూరి,వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చూసీ చూడంగానే’. పెళ్ళిచూపులు, మెంటల్ మదిలో వంటి ఫీల్ గుడ్ మూవీస్ నిర్మించి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుగాంచిన రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హీరో శివ కందుకూరి పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ పాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆగస్ట్ 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మెంట‌ల్ మ‌దిలో కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత డి సురేష్ బాబు సమర్పిస్తుండగా,గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :