శివాజీ, నిత్య, లెజ్లీ త్రిపాఠి నటీనటులుగా అనీల్ వాటుపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘చూసినోడికి చూసినంత’. పి.ఎస్.ఆర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై పి.శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 19న విడుదలవుతుంది.
అనీల్ ఈ సినిమాను హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అని హీరో శివాజీ అన్నారు.
ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్లలో పవన్ కళ్యాణ్ ను అనుకరిస్తూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన హంగామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్రం శ్రీను, ప్రభాస్ శ్రీను, అంబటి శ్రీను ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.


