కర్తాల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవంబర్ 21న ‘సినీ భస్మాసుర’ నాటక ప్రదర్శన

కర్తాల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవంబర్ 21న ‘సినీ భస్మాసుర’ నాటక ప్రదర్శన

Published on Nov 4, 2015 11:08 AM IST

cinema-actors
తనికెళ్ళ భరణి, బాబూ మోహన్‌, కోటా శంకర్‌రావు, సీనియర్‌ నరేష్‌, బ్రహ్మాజీ, శివాజీరాజా, సుమ కనకా, రవివర్మ, వైజాగ్‌ ప్రసాద్‌, అనితాచౌదరి, క్లాసికల్‌ డ్యాన్సర్‌ సరళకుమారి, టీవీ ఆర్టిస్ట్‌ నందకిషోర్‌, సురేష్‌కుమార్‌, సుప్రియ, సంజీవ్‌, పద్మనాభస్వామి, శివ, నిఖిల్‌, కృష్ణచైతన్య, అదితి, అవంతి తదితరులు కలిసి నటిస్తున్న నాటకం ‘సినీ భస్మాసుర’. కర్తాల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సీమా అజరుద్దీన్‌ నిర్మాతగా ఉదయభాను గరికిపాటి దర్వకత్వంలో ‘సినీ భస్మాసుర’ నాటకం నవంబర్‌ 21న ప్రదర్శించనున్నారు. సిరివెన్నె సీతారామశాస్త్రిగారు, కీరవాణిగారు ముందు గీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో….

సీమా అజారుద్దీన్‌ మాట్లాడుతూ ‘‘ఫారిన్‌ కంట్రీస్‌లోకూడా నాటక రంగానికి మంచి ఆదరణ ఉంది. అలాగే మన దేశంలో ఇతర భాషల్లో నాటక రంగానికి మంచి ప్రోత్సాహం aభిస్తుంది. కానీ తెలుగులో మాత్రం నాటక రంగానికి తగినంత ప్రోత్సాహం భించడం లేదు. తెలుగులో నాటక రంగాన్ని పునరుద్ధరించడం కోసం ఈ నవంబర్‌ 21న రవీంద్రభారతిలో ‘సినీ భస్మాసుర’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం. ఈ నాటకంలో సినీ రంగానికి చెందిన కళాకారులు కూడా నటిస్తుండటం మంచి పరిణామం. అందరికీ థాంక్స్‌’’ అన్నారు.

ఉదయభాను గరికిపాటి మాట్లాడుతూ ‘‘తెలుగు నాటక రంగాన్ని సీమా అజరుద్దీన్‌గారు ప్రోత్సహించడం ఎంతో ఆనందదాయకం. ఈ నాటకంలో 25 పాత్రలుంటాయి. నాటక రంగంలోవారే కాకుండా, సినీ రంగంలోనివారు ఇందులో నటిస్తున్నారు. ఒక నటుడికి కొన్ని కారణాల వల్ల నడుముకు దెబ్బ తగులుతుంది. అతన్ని పరామర్శించడానికి వచ్చిన అతని బంధుగణం, స్నేహితులు చేసే హడావుడే ఈ నాటకం కాన్సెప్ట్‌. పూర్తిస్థాయి హస్య నాటకం’’ అన్నారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ‘‘మేం సినిమా రంగానికి రాకముందు నాటక రంగానికి చెందిన వాళ్ళమే. ఇప్పుడు నాటక రంగం అత్యంత దీన పరిస్థితిలో ఉంది. నాటకాలు చూడటానికి జనం సిద్ధంగా ఉన్నప్పటికీ నాటకాు వేసేవాళ్ళే ముందుకు రావడం లేదు. విదేశాల్లో కూడా నాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బాలీవుడ్‌కి చెందిన ఓంపురి, నసీరుద్దీన్‌ షా టైమ్‌ దొరికినప్పుడంతా నాటకాలు వేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నాటక రంగానికి ప్రోత్సాహం అందించడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.

బాబూమోహన్‌ మాట్లాడుతూ ‘‘ఎప్పుడో స్కూల్‌డేస్‌లో నాటకాలు వేశాను. తర్వాత సినీ రంగంలోని ఎంట్రీ ఇచ్చాం. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికంటే ఈ నాటకంలో నటించడానికి ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చాలా తృప్తిగా ఉంది’’ అన్నారు.

సీనియర్‌ నరేష్‌ మాట్లాడుతూ ‘‘64 కళన్నీ సమానమే. సినిమాను 65వ కళ అనాలి. నేను 7 ఏటనే సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. 13 ఏట నాటకాు కూడా వేశాను. అలాగే జంధ్యాలగారి దర్శకత్వంలో నాటకాలు కూడా వేశాను. ఇప్పుడు కళాకారుల ఐక్యవేదికను స్థాపించి 19000 కళాకారులకు పించన్లు ఇప్పిస్తున్నాం. బ్రాడ్‌వే నాటకరంగంలో రిజిష్టర్‌ మెంబర్‌ అయిన సీమా అజరుదీన్‌గారి నిర్మాతగా ఈ నాటకం వేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

కోటశంకర్‌రావు మాట్లాడుతూ ‘‘ఈ నాటకంలో చాలా మంచి పాత్ర వేశాను. నేను ఎన్నో వేశాను. కానీ ఈ నాటకం వేస్తున్నప్పుడు ఎంతో తృప్తి కలిగింది. ఒక మంచి టీమ్‌ కుదిరింది. చాలా హ్యపీగా ఉంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, వైజాగ్‌ ప్రసాద్‌, శివాజీ రాజా, అనితా చౌదరి, రవివర్మ, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు