‘సినీ మహల్’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

‘సినీ మహల్’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

Published on Jul 31, 2015 2:37 PM IST

Cinimahal
కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్దాంశ్, రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా నటించిన ‘సినీ మహల్’ – రోజుకు 4 ఆటలు(ఉప శీర్షిక) అనే చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి సలోని ప్రత్యేక పాటలో నటించారు. అలాగే సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్, హాస్య నటుడు సత్య తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి నిర్మాతగా బి.రమేష్ వ్యవహరించగా, సంగీతాన్ని శేఖర్ చంద్ర అందించారు. అలాగే ఈ చిత్రానికి లక్ష్మణ్ వర్మ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఆగష్టు చివరివారంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ‘ఆడియో రిలీజ్’ జరుపుకోబోతున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమౌతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని పలువురు ప్రముఖులు ఆశించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు