చైతు “థ్యాంక్ యు” ఓటిటి రిలీజ్ రూమర్స్ పై అఫీషియల్ క్లారిటీ.!

Published on Dec 8, 2021 3:00 pm IST

అక్కినేని టాలెంటెడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “లవ్ స్టోరీ” తో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతే కాకుండా తన కెరీర్ లో బిగ్ హిట్ గా కూడా మలచుకున్నాడు. ఇక ఈ సినిమా లైన్ లో ఉండగానే చైతు స్టార్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “థ్యాంక్ యు ది మూవీ”.

తమ ఆస్థాన దర్శకునిగా అక్కినేని కుటుంబానికి వారి అభిమానులకి మర్చిపోలేని సినిమాలు ఇచ్చిన విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ పై లేటెస్ట్ గా పలు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం నేరుగా ఓటిటి లోనే రిలీజ్ అవుతుంది అని టాక్ రాగా ఇప్పుడు మేకర్స్ దీనిపై ఒక అధికారిక స్పష్టమైన క్లారిటీ అందించారు.

ఈ చిత్రం ఇపుడు ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉందని ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ కోసం మాత్రమే తీశామని, సో సరైన సమయంలో థియేటర్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ఒక క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :