
కోలీవుడ్ స్టార్ హీరోలలో మోస్ట్ టాలెంటెడ్ హీరో ధనుష్ కూడా ఒకరు. తనదైన నటనతో ఎలాంటి రోల్ ను అయినా సరే అద్భుతంగా పండించగలిగే ఈ హీరో నుంచి వచ్చిన సెన్సేషనల్ చిత్రం “అసురన్”. వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా “నారప్ప” అనే టైటిల్ తో మొదలు పెట్టగా ఈ చిత్రం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ చిత్రం చైనాలో కూడా రీమేక్ కానుంది అని పలు కథనాలు కొన్ని రోజుల నుంచి ఊపందుకున్నాయి.
దీనితో అరుదైన గౌరవం అసురన్ సినిమాకు దక్కింది అని ధనుష్ అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే అసలు విషయాల్లోకి వెళ్తే ఈ చిత్ర నిర్మాత ఎస్ థను ఈ చిత్రం చైనీస్ లో తెరకెక్కనుంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని కన్ఫర్మ్ చేసేసారు. తాము ఈ చిత్రాన్ని కన్నడ లో కూడా రీమేక్ చేసే యోచనలో ఉన్నామని తెలిపారు.