లిటిల్ మెగా ప్రిన్సెస్ పిక్ పై క్లారిటీ.!

లిటిల్ మెగా ప్రిన్సెస్ పిక్ పై క్లారిటీ.!

Published on Jun 21, 2023 3:08 PM IST

RC Upasana

నిన్ననే మెగా కుటుంబం ఇంట తమకి ఎంతో ప్రీతికరమైన రోజు ఆంజనేయ వారం మంగళవారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొణిదెల లు తల్లిదండ్రులు అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో అభిమానులు సహా మెగా ఫ్యామిలీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ శుభవార్తలో లిటిల్ మెగా ప్రిన్సెస్ ఆ పాపాయే అంటూ కొన్ని పిక్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం జరిగింది.

మరి ఈ వైరల్ అవుతున్న పిక్ అయితే చరణ్ కూతురిది కాదని అది ఫేక్ ఫోటో మాత్రమే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అయితే చాలా మంది ఆ ఫోటో నే నిజం అనుకోని నమ్మారు. అయితే ఓ మంచి రోజున అవన్నీ బయటకి వస్తాయని చెప్పొచ్చు. ఇక చరణ్ అయితే ప్రస్తుతం మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూట్ లో చరణ్ త్వరలోనే పాల్గొననున్నాడు.

తాజా వార్తలు