అవి పవన్ సొంత ఖర్చులే.. పవన్ ప్రస్తుత పరిస్థితిపై కీలక అప్డేట్ ఇచ్చిన అనా లెజినోవా

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భుజాలకి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. దీనితో దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ ని పరామర్శించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. పవన్ కేవలం హీరో గానే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని కూడా తెలిసిందే.

అయితే పవన్ ఇప్పుడు తనకి చేసుకుంటున్న చికిత్సకి గాను ప్రభుత్వ సొమ్మునే వాడుకుంటున్నారు అంటూ వచ్చిన వదంతులు పవన్ బృందం ఖండించారు. పవన్ కి ఆ వెసులుబాటు ఉన్నప్పటికీ తాను తన సొంత ఖర్చులే ఇప్పుడు భుజం చికిత్సకు ఆ మధ్య ముక్కు చికిత్సకు కూడా పెట్టుకున్నట్టు వారు తెలిపారు.

సో ఆ రూమర్స్ పై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ కి మరో భుజం ట్రీట్మెంట్ కావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉండగా పవన్ ఆరోగ్యానికి సంబంధించి అనా లెజినోవా కీలక అప్డేట్ అందించారు. ఫైనల్ గా పవన్ డిశ్చార్జ్ అయినట్టు కీలక అప్డేట్ అందించి, వైద్యంలో సహకారం అందించిన టీం అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ తర్వాత మళ్ళీ విశ్రాంతి తీసుకొని సినిమాలు, రాజకీయ పనుల్లో బిజీ కానున్నారు. తన అవైటెడ్ సినిమా ఓజి 2 ను కూడా తాను త్వరగానే స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

Exit mobile version