“పుష్ప 2” రిలీజ్ డేట్ పై అసలు క్లారిటీ ఇదే!?

“పుష్ప 2” రిలీజ్ డేట్ పై అసలు క్లారిటీ ఇదే!?

Published on Jun 12, 2024 11:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం మాత్రమే కాకుండా, సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమా కోసం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. పలు కారణాల వలన సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిత్ర షూటింగ్ కూడా రెండు యూనిట్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా అనుకున్న టైమ్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఫహాద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు