తారక్, త్రివిక్రమ్ ల సినిమా టైటిల్ రచ్చపై క్లారిటీ..?

Published on Jan 16, 2021 10:00 am IST

“అరవింద సమేత” అనే సినిమాతో సరికొత్త మాస్ యాంగిల్ ను రుచి చూపించారు దర్శకుడు త్రివిక్రమ్ మరియు హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీనితో ఈ కాంబో నుంచి రెండో సినిమా కూడా రావాలని అప్పుడే అభిమానులు ఫిక్స్ అయ్యారు. మరి అప్పట్లోనే వారి అంచనాలకు తగ్గట్టుగా త్రివిక్రమ్ టీం మరో సినిమాను తారక్ తో ఉన్నట్టుగా అనౌన్స్ చేసేసారు.

ఇక అలాగే ఈ చిత్రానికి గాను త్రివిక్రమ్ మార్క్ “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలిసింది. అయితే ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు అంటే ఇక ఆ టైటిల్ కన్ఫర్మ్ అన్నట్టే మరి. కానీ కొన్నాళ్ల నుంచి మాత్రం మరో టైటిల్ రేస్ లోకి వచ్చింది. అదే “చౌడప్ప నాయుడు” అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది.

మరి టైటిల్ ఇదా అదా అన్న ప్రశ్నకు సమాధానంగా మొదటిదే అన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ సినిమాలో తారక్ రోల్ పేరు చౌడప్ప నాయుడు అని ఉంటుంది అని మరో వెర్షన్ గాసిప్. సో ఈ చిత్రానికి చౌడప్ప నాయుడు అనే టైటిల్ ఉండడానికి దాదాపు అవకాశమే లేదు. ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారే నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :