విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వెంకీ కెరీర్‌లోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. 2025 సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాగా తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడితో ఈ సీక్వెల్ చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
అలాగే, ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ పై కూడా ఓ అప్ డేట్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతికి బరిలోకి ఈ సీక్వెల్ ని రిలీజ్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నట్లు టాక్. వెంకటేష్ సహజ నటన, కుటుంబానికి దగ్గరైన కథనం, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనింగ్ స్క్రీన్‌ప్లే కూడా ఈ సినిమా విజయానికి హెల్ప్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. ఈ సీక్వెల్ లో కూడా వీరితో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది.


