“టక్ జగదీశ్” రిలీజ్ వార్తలపై క్లారిటీ..!

Published on Jul 17, 2021 2:59 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘టక్ జగదీష్’. ఈ సమ్మర్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో ‘టక్ జగదీశ్’ సినిమా ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా ‘టక్ జగదీశ్’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్ సినిమా రిలీజ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్ని అవాస్తవమని, వాటిని నమ్మకండని చెప్పుకొచ్చింది సినిమా విడుదల ఖరారైతే దర్శకనిర్మాతలే అధికారికంగా తేదీనీ ప్రకటిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నానీకి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌లుగా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గారపాటి, హ‌రీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించగా, త‌మ‌న్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :