హరీష్ శంకర్, శివకార్తికేయన్ మూవీపై అసలు క్లారిటీ.!

హరీష్ శంకర్, శివకార్తికేయన్ మూవీపై అసలు క్లారిటీ.!

Published on Dec 29, 2022 3:04 PM IST

తమిళ్ సహా తెలుగు లో కూడా మంచి ఆదరణ ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో శివ కార్తికేయన్ కూడా ఒకడు. తన “డాన్”, “డాక్టర్” చిత్రాలతో అలరించిన ఈ టాలెంటెడ్ హీరో రీసెంట్ గా “ప్రిన్స్” తో పలకరించాడు. అయితే ఇప్పుడు తమిళ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న తాను మరో టాలీవుడ్ దర్శకుడు అందులోని దర్శకుడు హరీష్ శంకర్ తో అయితే ఓ సినిమాని టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు తో చేయనున్నట్టుగా కొన్ని రూమర్స్ ఇటీవల వచ్చాయి.

మరి దీనిపై అయితే ఒక పటిష్టమైన క్లారిటీ వినిపిస్తుంది. అసలు ఈ కాంబినేషన్ రూమర్స్ పై ఎలాంటి నిజం లేదట. ఈ వార్తలని అవాస్తం అని అయితే ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి లేటెస్ట్ సమాచారం. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేయనుండగా దిల్ రాజు తన వారిసు సినిమా రిలీజ్ పనిలో ఉన్నారు అలాగే శివకార్తికేయన్ మావీరన్ అనే సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు