నయన్ ‘కోకో కోకిల’ విడుదల తేదీ ఖరారు !

నయన్ ‘కోకో కోకిల’ విడుదల తేదీ ఖరారు !

Published on Aug 21, 2018 7:59 PM IST

నయనతార ప్రధాన పాత్రలో తమిళ భాషలో నటించిన చిత్రం’కొలమావు కోకిల’. ఆగస్టు 17న విడుదలైన ఈ చిత్రం అక్కడ మూడు రోజుల్లోనే 11కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది.

ఇక ఈచిత్రాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ‘కోకో కోకిల’ పేరుతో తెలుగులో సొంతంగా విడుదల చేస్తుంది. నిజానికి తమిళ బాషతో పాటు తెలుగులోను అదే రోజు విడుదలకావల్సిన ఈచిత్రం అనివార్యకారణాలవల్ల వాయిదా పడింది. ఇక ఈచిత్రం.ఎట్టకేలకు ఆగస్టు 31న తెలుగు ప్రేక్షకులముందుకు రానుంది.

యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నెల్సన్ తెరకెక్కించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శరణ్య, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు