రెండో వివాహం చేసుకున్న నటుడు !
Published on Aug 17, 2018 1:50 pm IST

తెలుగు సినీపరిశ్రమలో కమెడియన్ గా రాణిస్తున్న నటుడు జోగినాయుడు. కాగా జోగినాయుడు రెండో వివాహం చేసుకున్నారు. మొదట ఓ ప్రముఖ యాంకర్ ను వివాహం చేసుకున్న ఆయన, కొన్ని కారణాల వల్ల ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. అయితే వారికి ఓ కుమార్తె కూడా ఉంది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే ఉంటున్న జోగినాయుడు గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో రెండో వివాహం చేసుకున్నారు.

జోగినాయుడు వివాహం చేసుకున్న వధువు పేరు సౌజన్య. ఆమె స్వస్థలం విశాఖ జిల్లాలోని చెర్లోపాలెం గ్రామం. కాగా జోగినాయుడిది కూడా ఇదే గ్రామం. తన ఊరు అమ్మాయినే పెళ్లి చేసుకోవటం పట్ల ఆ గ్రామ ప్రజలు తమ అనందం వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook