ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ మృతి

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ మృతి

Published on Sep 25, 2019 1:20 PM IST

Venu Madhav1

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ నేడు తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపదున్న ఆయన నిన్న హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. నిన్నటి నుండి విషమంగా ఉన్న ఆయన ఆరోగ్యపరిస్థితి నేడు ఇంకా దిగజారినట్లు తెలుస్తుంది.వేణు మాధవ్ 12 గంటల ఇరవై నిముషాలకు మృతి చెందినట్లు అధికారికంగా కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.

నేటి మధ్యాహ్నం రెండు గంటలకు కాప్రా ఎహ్ డి కాలనీకి ఆయన మృతదేహం తరలించనున్నారని సమాచారం. నల్గొండ జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్ 1996లో కృష్ణ హీరోగా దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన సంప్రదాయం సినిమాతో తెలుగు తెరకు పరిచయ్యారు. విలక్షణ నటన, తెలంగాణా మాండలికంలో ఆయన చెప్పే డైలాగ్స్ కారణంగా అనతి కాలంలోనే టాప్ కమెడియన్ గా ఎదిగారు.

‘హంగామా’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన ఆ తర్వాత తానే నిర్మాతగా, కథానాయకుడిగా ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాలు నిర్మించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోనూ పనిచేశారు. కోదాడకు చెందిన వేణుమాధవ్ హైదరాబాద్ మౌలాలీలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్ దాదాపు నాలుగువందల చిత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు