ప్రస్తుతం టాలీవుడ్ లో మనీ అంతా కమెడియన్స్ చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ మరియు ప్రతి హీరో కమర్షియల్ పరంగా, సపోర్టింగ్ కోసం కమెడియన్స్ ని ఎక్కువగా సినిమాలో పెడుతున్నారు. దానివల్ల నిర్మాతలు ఎక్కువ మనీ ఈ కమెడియన్స్ పై వెచ్చించాల్సి వస్తోంది.
బ్రహ్మానందం, అలీ లాంటి కమెడియన్స్ రోజుకి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అలాగే వాళ్ళు ప్రతి సంవత్సరం 30-50 సినిమాలు చేస్తున్నారు, దానివల్ల వాళ్ళ ఆదాయం కోట్లల్లో ఉంటోంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది కమెడియన్స్ ఆదాయం కొంతమంది హీరోలకంటే ఎక్కువగా ఉంది.
ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న సప్తగిరి మరియు జబర్దస్త్ షో ద్వారా శకలక శంకర్, ధన్ రాజ్ లాంటి కొంతమంది కమెడియన్స్ కూడా ప్రస్తుతం సినిమాల్లో మరియు రియాలిటీ షోస్ లో కనిపించి బాగా సంపాదించుకుంటున్నారు.


