మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా దసరా కానుకగా రిలీజ్ అయ్యి రామ్ చరణ్ కెరీర్లో మరో 40 కోట్ల మార్క్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం హాలిడే కోసం అమెరికా వెళ్ళిన రామ్ చరణ్ తన తదుపరి మూవీగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఓరువన్’ రీమేక్ లో నటించనున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథని మార్చే పనిలో ఉన్నాడు. అల్లు అరవింద్ – ఎన్.వి ప్రసాద్ లు కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ మరో తమిళ రీమేక్ మూవీ రైట్స్ తీసుకున్నారని కోలీవుడ్ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే,1970-90లలో తమిళ్ లో స్టార్ కమెడియన్ గా వెలుగొందిన గౌండమణి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ హీరోగా చేసిన సినిమా ’49-ఓ’. ఈ సినిమా కాన్సెప్ట్ కి మాత్రం తమిళంలో మంచి పేరు వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన రామ్ చరణ్ కి కాన్సెప్ట్ బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా రీమేక్ రైట్స్ ని తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమా ఎవరితో చేద్దాం అని చరణ్ రీమేక్ రైట్స్ తీసుకున్నాడన్నది తెలియాల్సి ఉంది.


