దెయ్యం కథనే బలంగా నమ్ముకున్న కామెడీ స్టార్!
Published on Oct 25, 2016 6:53 pm IST

intlodeyam-nakem-bayam
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గత కొద్దికాలంగా ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్న నరేష్, ఈమధ్య కాలంలో మాత్రం ఎక్కడా మెప్పించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ఆయన తన కొత్త సినిమాను తెలుగులో ప్రస్తుతం హాట్ ఫేవరైట్ అయిన హర్రర్ కామెడీ జానర్లో చేశారు. ‘ఇంట్లో దయ్యం నాకేం భయం’ అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఆలోచనతో అల్లరి నరేష్ ఇప్పట్నుంచే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయడంతో పాటు, ఈనెల 28న ఆడియో విడుదల చేపట్టేందుకు ప్లాన్ చేశారు. నరేష్ స్టైల్లో కామెడీకి తోడు ఈసారి హర్రర్ కూడా తోడవ్వడం ప్లస్‌ అని టీమ్ భావిస్తోంది. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాత బీవీఎస్‍ఎన్ ప్రసాద్ నిర్మించారు.

 
Like us on Facebook