నటుడు శివాజీ తాజాగా ‘దండోరా’ చిత్ర ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్ పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో శివాజీని పలువురు తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల గురించి శివాజీ ఇలా ఓ వేదికపై చేసిన కామెంట్స్ తీవ్ర అభ్యంతరకరమని వారు మండిపడుతున్నారు.
అయితే, ఈ వివాదం ముదిరి గాలివానగా మారుతోంది. దీంతో సినీ పరిశ్రమలోని పలువురు కూడా శివాజీ చేసిన కామెంట్స్‌ను తప్పుబడుతున్నారు. తాజాగా శివాజీ చేసిన కామెంట్స్‌పై ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ తరఫున దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీ ‘మా’కు ఫిర్యాదు చేశారు.
ఆడవారి పట్ల ఇలా బహిరంగంగా చేసిన వివాదాస్పద కామెంట్స్ సమాజానికి హానికరమని.. ఇలాంటి కామెంట్స్ చేస్తే ఉపేక్షించేది లేదని.. నటుడు శివాజీ తక్షణమే మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరి ఈ వివాదంపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.


