నేటి సమాజపు పరిస్థితులలో మత ధర్మాలను, దైవ మూలాలను ప్రశ్నించే ‘గోపాల గోపాల’ వంటి చిత్రాలు ఎదురుదెబ్బలు తగలడం సర్వసాధారణం. అయితే ఈ సినిమాపై ఆ ప్రభావం తొలిరోజే పడింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువులను, వారి మతధర్మాలను కించపరిచేలా వున్నాయంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో రఘునాధరావు అనే వ్యక్తి కంప్లయింట్ ఫైల్ చేశాడు
ఈ కష్టాలు సినిమా విడుదలకు ముందు కూడా ‘గోపాల గోపాల’ ఎదుర్కుంది. సినిమాను సెన్సార్ చెయ్యకూడదు అంటూ VHP మరియు బజరంగ్ దళాలనుండి బెదిరింపులు వచ్చాయి. అయితే ఎట్టకేలకు సెన్సార్ విజయవంతంగా పూర్తిచేసుకుని ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసల జల్లుని సైతం కురిపిస్తున్నారు
