టీమ్ ఇండియా కోసం పాట స్వరపరిచిన కీరవాణి 1

టీమ్ ఇండియా కోసం పాట స్వరపరిచిన కీరవాణి 1

Published on Feb 12, 2015 5:30 PM IST

Keeravani
సంచలనాత్మక సంగీత దర్శకుడు కీరవాణి ఎప్పుడోగానీ బాలీవుడ్ కి సంగీతం అందించరు. అయితే త్వరలో మహేందర్ సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం కీరవాణి ప్రపంచ కప్ సందర్భంగా భారతీయ జట్టుకి ఒక పాటను అంకితం ఇవ్వనున్నాడు. ఈ పాటను ఫిబ్రవరి 15న ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా విడుదలచేయనున్నారు. ప్రస్తుతం కీరవాణి బాహుబలి చిత్ర ఫినిషింగ్ టచ్ లు ఇవ్వడంలో బిజీగా వున్నాడు.

తాజా వార్తలు