కాన్సెప్ట్ పోస్టర్ తో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ !

కాన్సెప్ట్ పోస్టర్ తో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ !

Published on Aug 14, 2018 10:54 PM IST


మాస్ మహారాజ్ రవితేజ, శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ న్యూయార్క్ లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ ను రేపు స్టార్ట్ చేయనుంది చిత్రం టీం. దాంట్లో భాగంగా రేపు ఉదయం 9:30 గంటలకు ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదలచేయనున్నారు.

ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా కథానాయికగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు