‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వబోతుందని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కాగా ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ తోనే. లాక్ డౌన్ సందర్భంగా దొరికిన ఖాళీ సమయాన్ని త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే దృష్టి పెట్టాడట. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మధ్య ఈ సినిమాకి సంబంధించి డిస్కషన్స్ కూడా నడుస్తోన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇక మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం 2021 దసరాకి విడుదల కానుంది.


