‘నందమూరి బాలకృష్ణ’ అతి త్వరలో ‘వి వి వినాయక్’ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారని సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం బాలకృష్ణ నటించాల్సిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాని తాత్కాలికంగా నిలిపివేసారని సోషల్ మీడియాలో అలాగే ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా దర్శకుడు తేజ తెరకెక్కించాల్సి ఉండగా సినిమా ప్రారంభం అయిన కొద్ధి రోజుల తరువాత ఈ సినిమా నుండి అనూహ్యంగా ఆయన తప్పుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కు నేను న్యాయం చేయలేమోనని అందుకే ఈ చిత్రం నుండి తప్పుకుంటున్నాని వివరణ కూడా ఇచ్చాడు.
దీని తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి హీరో బాలకృష్ణే దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాని చంద్ర సిద్ధార్థ ఆధ్వర్యంలో బాలకృష్ణే దర్శకత్వం వహిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. దీని వలన అసలు ఈ సినిమా ఉంటుందా లేదా ఒకవేళ తీస్తే ఎవరు దర్శకత్వం వహిస్తారు వంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తెలియాలంటే సినిమాకి సంభందించి అధికారికంగా ఒక ప్రకటన వెలువడాలి.


