వివాదం లో రజనీ ‘లింగా’

వివాదం లో రజనీ ‘లింగా’

Published on May 16, 2014 10:09 AM IST

Rajani-kanth
అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న రజనీ ‘కొచ్చాడియాన్’ ఇంకా విడుదల కాకముందే ఆయన తాజా చిత్రం ‘లింగా’ వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ‘లింగా’ వివాదాస్పదమైన ముల్లపెరియార్ డాం పై ఆధారపడివుంటుంది.

కేరళ లోని పెరియార్ నది పై నిర్మించిన ముల్లపెరియార్ డాం కేరళ తమిళనాడు ల మధ్య తరచు గొడవలకి కారణం అవుతుంది. సమాచారం ప్రకారం రజనీ ‘లింగా’ చిత్రం లో చీఫ్ ఇంజనీర్ పాత్ర ని పోషిస్తున్నారు. ఈ విషయం కూడా పెద్ద వివాదానికి దారి తీయవచ్చు.

ఇదిలావుండగా ఈ చిత్రానికి డాం వివాదానికి ఎటువంటి సంబంధం లేదని నిర్మాతలు ప్రకటించారు. గతం లో ముల్లపెరియార్ డాం ఆధారం గా నిర్మింపబడిన ఇంగ్లీష్ చిత్రం ‘డాం 999’ తమిళనాడు ప్రభుత్వం నిశేదించింది.

ఈ చిత్రం ఎటువంటి వివాదాల్ని సృష్టిస్తుందో వేచి చూడాలి. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో సోనాక్షి సిన్హా మరియు అనుష్క ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు