దేవుడితో పోరాటానికి సన్నద్ధమైన కూల్ హీరో !

దేవుడితో పోరాటానికి సన్నద్ధమైన కూల్ హీరో !

Published on Jul 9, 2018 12:09 AM IST

subra5

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా రాబోతున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రంలో సుమంత్ సరసన ఈషా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ‘సుబ్రహ్మణ్యపురం’ సుమంత్ కి 25వ చిత్రం కావడం విశేషం. కాగా ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలుస్తోంది.ఇందులో సుమంత్ ఒక నాస్తికుడిగా తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం ఏకంగా దేవుడితోనే పోరాడబోతున్నాడు. ఈ ఆసక్తికరమైన థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టులో చిత్రీకరణ వెళ్లబోతుంది. ఈ చిత్రానికి ఆర్కే ప్రతాప్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చిత్రాన్ని టారస్ సినీకార్పు మరియు సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి మరియు ధీరజ్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు