శివాజీ దీక్షను భగ్నం చేసిన పోలీసులు.!

శివాజీ దీక్షను భగ్నం చేసిన పోలీసులు.!

Published on May 6, 2015 3:00 PM IST

shivaji

ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మొదట నటుడిగా, ఆ తర్వాత కామెడీ హీరోగా ఎన్నో సినిమాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో శివాజీ. హీరోగానే కాకుండా మానవతావాదం కూడా ఎక్కువగా ఉన్న శివాజీ గత ఎలక్షన్స్ నుంచి రాజకీయాల్లో కూడా ఓనమాలు నేర్చుకుంటూ చురుకుగా పబ్లిక్ ఫంక్షన్స్ లో పాల్గొంటున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఆ విషయంపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించక పోవడంతో శివాజీ ప్రజల తరపున పోరాడటానికి సిద్దమయ్యాడు.

అందులో భాగంగా శివాజీ వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని గుంటూరులో నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. ఈ నిరాహార దీక్ష నేటితో నాలుగవ రోజుకి చేరుకుంది. దీంతో శివాజీ ఆరోగ్యం బాగా క్షీణించిందని డాక్టర్స్ చెప్పడంతో పోలీసులు బలవంతంగా శివాజీ నిరాహార దేక్షని భగ్నం చేసి, అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ శివాజీకి సపోర్ట్ గా ఉన్న వారు ఈ విషయాన్ని ఖండించడమే కాకుండా ఆందోళన చేసారు. తన దీక్షను భగ్నం చేయడం కాదు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని బిజెపి లీడర్స్ ని శివాజీ కోరాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు