‘వారణాసి’ అసలు బలం అదే అంటున్న రాజమౌళి..!

Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పౌరాణిక అంశాలు, టైమ్ ట్రావెల్, అంతర్జాతీయ విజువల్స్, విపరీతమైన అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నప్పటికీ, ఈ కథకు అసలైన సోల్ తండ్రీ కొడుకుల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ బాండ్ అని రాజమౌళి వెల్లడించారు.

ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన తండ్రిగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడట. కథ ఎంతటి భారీ స్థాయిలో విభిన్న కాలాలు, ప్రపంచాల మీదుగా సాగినప్పటికీ, ఈ ఎమోషనల్ బాండింగ్ సినిమాను నడిపించే మెయిన్ పాయింట్‌గా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రం కేవలం ఒక సాదాసీదా అడ్వెంచర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా, రామాయణ ఆధారిత పౌరాణిక ఘట్టాలతో పాటు ఫాంటసీ అంశాల మేళవింపుగా రూపుదిద్దుకుంటోంది.

ఇందులో మహేష్ బాబు ‘శ్రీరాముడి’ పాత్రలో కనిపించే కీలక ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

Exit mobile version