కార్పొరేట్, రూరల్ బ్యాక్ డ్రాప్లో ‘ఎం.ఎల్. ఏ’ !
Published on Mar 15, 2018 2:50 am IST

కళ్యాణ్ రామ్, కాజల్ నటించిన ‘ఎం.ఎల్. ఏ’ సినిమా మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రేపు సెన్సార్ జరుపుకోనున్న ఈ సినిమాను బ్లూ ప్లానెట్ బ్యానర్ పై భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. అందులో మొదటిపాట ఇటీవల విడుదల అయ్యింది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించడం జరిగింది.

ఈ సినిమా మొదటి సగం కార్పొరేట్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. సెకండ్ హాఫ్ రూరల్ బ్యాక్ డ్రాప్లో ఉండబోతోంది. ఎం.ఎల్.ఏ అనే టైటిల్, టీజర్ చూసి ఇది ఒక పొలిటికల్ సినిమా అనుకుంటారు కానీ ఈ మూవీలో రాజకీయ పరంగా ఎటువంటి సన్నివేశాలు ఉండబోవని తెలుస్తోంది. కామెడి ఎంటర్టైనెర్ గా ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

 
Like us on Facebook