తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులను కలిసిన కోస్టా రిక అధికార ప్రతినిధి

tfi

కోస్టా రిక దేశ అధికార ప్రతినిధి శ్రీమతి సోఫియా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దాము గారిని మరియు నిర్మాతల మండలి సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. వారితో పాటు ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, రామ్ సత్యనారాయణ లను కూడా ఆమె కలిశారు. ఈ సందర్భంగా కోస్టా రిక దేశంలో షూటింగులకు గల అవకాశాలని ఆమె వివరించారు. షూటింగ్ అనుమతులు అన్నీ సింగిల్ విండో విధానంలో ఇస్తామని.. పన్ను రాయితీలు కల్పిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని సోఫియా గారితో సందేహాలు నివృత్తి చేసుకొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలి తరపున ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, రామ్ సత్యనారాయణ శ్రీమతి సోఫియాని సన్మానించారు. ఫ్యూజీ సాఫ్ట్వేర్ మనోహర్ రెడ్డి, పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోఫియా సలాస్ మాట్లాడుతూ.. తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దాము గారిని మరియు తెలుగు ఫిలిం నిర్మాతలు మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ గారిని మరియు నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, రామ్ సత్యనారాయణని కలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మోహన్ ముళ్ళపూడితో ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించి తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహకరిస్తున్న మోహన్ ముళ్ళపూడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉన్నదేశాలన్నిటిలో మా దేశం కూడా చాలా అందమైనది. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకి పర్మిషన్లు ఇస్తాము. నిర్మాతలు కోస్టా రిక దేశంలో షూటింగ్ చేయాలనుకునేవారు తెలుగు ఫిలిం ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అని తెలియజేశారు.

Exit mobile version