హాజరు కాకుంటే సూపర్ స్టార్ అరెస్ట్ ఖాయం

హాజరు కాకుంటే సూపర్ స్టార్ అరెస్ట్ ఖాయం

Published on Sep 27, 2019 8:15 AM IST

కృష్ణ జింకలను వెంటాడిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న సూపర్ స్టార్ సల్మాన్ నేడు జోధ్ పూర్ కోర్ట్ కి హాజరుకావలసిందిగా మేజిస్ట్రేట్ ఆదేశించడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఆయన విచారణకు హాజరుకాని నేపథ్యంలో నేడు హాజరుకాకున్న యెడల అతని బెయిల్ రద్దు చేయడంతో పాటు అరెస్ట్ చేయాల్సివుంటుందని హెచ్చరించారు. కాగా నేడు సల్మాన్ ఖాన్ తప్పకుండ జోధాపూర్ కోర్ట్ లో విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొనివుంది.

ఇరవై ఏళ్లకు పైగా సల్మాన్ ని ఈ కేసు వెంటాడుతుంది. 1998వ సంవత్సరంలో హమ్ సాత్ సాత్ హై చిత్ర షూటింగ్ కొరకు జోధాపూర్ వెళ్లిన సల్మాన్ అక్కడ కృష్ణ జింకలను వేటాడారు అనే అభియోగం ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో భాగంగా 2007లో సల్మాన్ ఒక వారం జోద్ పూర్ జైల్లో గడిపారు. ప్రస్తుతం సల్మాన్ నటించిన దబాంగ్ 3 డిసెంబర్ 20న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం ప్రభుదేవా వహించగా సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు