“దేవర” సెకండ్ సింగిల్ పై క్రేజీ బజ్!

“దేవర” సెకండ్ సింగిల్ పై క్రేజీ బజ్!

Published on Jul 10, 2024 7:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా అలాగే టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే “దేవర”. మరి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ సినిమాపై హైప్ మరింత పెరుగుతూ వెళ్తుండగా ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ సాలిడ్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ అంతా రెండో పాట కోసమే ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సాంగ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సాంగ్ వచ్చే వారం లోనే రానున్నట్లు వినిపిస్తోంది. ఇక దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు