ఓటీటీలో ‘జైలర్ 2’ అన్ కట్ వెర్షన్ పై క్రేజీ బజ్!

ఓటీటీలో ‘జైలర్ 2’ అన్ కట్ వెర్షన్ పై క్రేజీ బజ్!

Published on Nov 17, 2026 7:00 AM IST

ఈ ఏడాది దక్షిణాది సినిమా నుంచి సెన్సేషనల్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం జైలర్ 2 కూడా ఒకటి. పార్ట్ 1 ను మించి రికార్డు వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి ముందే చాలా రన్ టైం ని కట్ చేసుకుంది అనే టాక్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది.

ఇక నెక్స్ట్ ఓటీటీలో అయినా జైలర్ అన్ కట్ వెర్సన్ చూడొచ్చు అనుకుంటే ప్రైమ్ వీడియోలో కూడా నిరాశే మిగిలింది. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఎప్పుడు ఫుల్ వెర్షన్ వస్తుంది అనే లేటెస్ట్ రూమర్ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీని ప్రకారం డిసెంబర్ లో రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా జైలర్ 2 అన్ కట్ వెర్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఫ్యాన్స్ కి అంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఉండదు. సో దీనిపై మరింత క్లారిటీ బయటకు రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు