ఈ ఏడాది ముగింపు బ్యాంగర్ చిత్రాలుగా రిలీజ్ కి సిద్ధం అవుతున్న లేటెస్ట్ సినిమాల్లో కింగ్ నాగార్జున హీరోగా దర్శకుడు కార్తీక్ బి తెరకెక్కిస్తున్న కింగ్ 100 కూడా ఒకటి. మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి తక్కువ కంటెంట్ నే బయటకి వచ్చింది కానీ ఫ్యాన్స్ ని అలరించింది. జెనరల్ ఆడియెన్స్ లో కూడా బాగానే బజ్ సెట్ చేసింది.
అయితే ఈ సినిమాతోనే విడుదలకి రాబోతున్న దాదా, రియాలిటీ లతో పోలిస్తే ప్రమోషన్స్ పరంగా కొంచెం వెనుకబడింది అనే చెప్పాలి. ఆ రెండు సినిమాల నుంచి ఆల్రెడీ పాటలు, సోషల్ మీడియాలో సందడి కూడా కొనసాగుతుంది. కానీ కింగ్ 100 నుంచి అలాంటివి ఏమీ లేదు. అంతెందుకు డబ్బింగ్ సినిమా ‘కింగ్’ నుంచి కూడా పాటలు వచ్చేస్తున్నాయి.
కానీ ఈ సినిమా ప్రస్తుతం ఫోకస్ అంతా షూట్ పైనే నడుస్తుంది. మరి ప్రమోషన్స్, ఫస్ట్ సింగిల్ వంటివి ఎప్పుడు మొదలవుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే టబు తదితరులు నటిస్తుండగా నాగార్జున నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతుంది.


