ప్రభాస్ ‘స్పిరిట్’ పై క్రేజీ బజ్

Published on Sep 12, 2023 12:11 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్రాజక్ట్స్ తో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో సలార్, కల్కి 2898 ఏడి, మారుతీ తో చేస్తున్న సినిమాలు ఉన్నాయి. వీటి అనంతరం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ అనే మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక తాజా బాలీవుడ్ బజ్ ప్రకారం ఈ ప్రతిష్టాత్మక మూవీని వచ్చే ఏడాది జూన్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా మూవీ యొక్క స్క్రిప్ట్ ని అదిరిపోయే రేంజ్ లో సిద్ధం చేస్తున్నారట దర్శకుడు సందీప్ రెడ్డి. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో తీస్తున్న యానిమల్ మూవీ పై బాగా ఫోకస్ పెట్టిన సందీప్ అది పూర్తి అయిన తరువాత ఫుల్ గా స్పిరిట్ పై దృష్టి కేంద్రీకరించనున్నారట. ఇక ఈ క్రేజీ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం :