‘గుంటూరు టాకీస్’ కోసం క్రేజీ కాంబినేషన్

‘గుంటూరు టాకీస్’ కోసం క్రేజీ కాంబినేషన్

Published on May 5, 2015 2:09 PM IST

guntur-tallkis1
గత ఏడాది 8 కథలను ఒకేచోట దండలా కూర్చి ‘చందమామ కథలు’ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి విమర్శకుల నుంచి ప్రశంశలు రావడమే కాకుండా, ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డును కూడా తెచ్చి పెట్టింది. ప్రవీణ్ సత్తారు తన తదుపరి సినిమాకి రంగం సిద్దం చేసుకుంటున్నాడని, మధు శాలినిని మెయిన్ లీడ్ గ సెలక్ట్ చేసారని ఇది వరకే తెలియజేశాం. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకోసం ఓ క్రేజీ టైటిల్ ని పెట్టడమే కాకుండా క్రేజీ స్టార్స్ ని ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ చేస్తున్నాడు.

ముందుగా ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి ‘గుంటూరు టాకీస్’ అనే టైటిల్ ని ఖరారు చేసాడు. అలాగే ఈ సినిమాలో మధు శాలిని తో పాటు ఎల్బిడబ్ల్యూ ఫేం సింధు కూడా మెయిన్ లీడ్ లో కనిపించనుంది. వీళ్ళిద్దరూ కాకుండా అందాల భామ శ్రద్ధ దాస్, సీనియర్ నరేష్, బాలీవుడ్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ లను ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా గుంటూరు స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని, ఇందులో ప్రవీణ్ ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదని ఈ చిత్ర టీం అంటోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

తాజా వార్తలు