క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది !

తమిళ నటుడు సూర్య కెరియర్ సింగం సిరీస్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లు మాస్ ఎంటర్ టైనర్ గా పర్ఫెక్ట్ కాప్ డ్రామా ప్రేక్షకులను అలరించింది. తాజాగా దర్శకుడు హరి సూర్య తో సినిమా ప్రకటించాడు. ప్రస్తుతం హరి విక్రమ్ తో సామి సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూర్య సినిమా చెయ్యబోతున్నాడు ఈ దర్శకుడు.

సూర్య, హరి కాంబినేషన్ లో వచ్చే సినిమా సింగం సీక్వెలా కాదా అన్నది తెలియాల్సి ఉంది. సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కె.వి.ఆనంద్ తో ఒక సినిమా చేస్తాడు. ఈ మూవీ తో పాటు హరి సినిమా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Exit mobile version