పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ‘క్రేజీ కేజీ ఫీలింగ్’ !
Published on Sep 12, 2018 4:17 pm IST


సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో విజ్ఞత ఫిలిమ్స్ పతాకం పై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. విష్వoత్, పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ.. కేరింత, మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా, పల్లక్ లల్వాని హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది . ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం. మెయిన్ గా వెన్నెల కిశోర్ పాత్ర ఆకట్టుకుంటుంది.

నిర్మాత మధు మాట్లాడుతూ .. ప్రేమ, ఫీల్, వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతమిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకే చిన్న సినిమా, విడుదల అయ్యాక ఈ చిత్రం సాధించే విజయాన్ని బట్టి ఇది పెద్ద సినిమా అవుతుందని తెలిపారు.

విష్వoత్, పల్లక్ లల్వాని, వెన్నెల కిశోర్, ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం సమకూర్చగా, సాహిత్యం సురేష్ ఉపాధ్యాయ, కాసర్ల శ్యామ్ అందించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook