చరణ్ కోసం క్రేజీ డైరెక్టర్ ని రంగంలోకి దింపిన పవన్

చరణ్ కోసం క్రేజీ డైరెక్టర్ ని రంగంలోకి దింపిన పవన్

Published on Oct 28, 2015 7:00 PM IST

ram-charan-interview
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా ఎప్పటిలానే చరణ్ 40 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసే దిశగా బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కథని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న చరణ్ తన తదుపరి సినిమాని జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. తమిళ హిట్ మూవీ తని ఓరువన్ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. ఇది పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తాడని ఇది వరకే అనౌన్స్ చేసాడు.

చారాన్ కూడా వచ్చే ఏడాది ఆ సినిమా ఉంటుందని ఖరారు చేసాడు. తాజాగా ఈ సినిమాకోసం పవన్ ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసాడట. పవన్ తన బ్యానర్ లో చేస్తున్న సినిమా డైరెక్టర్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఎంపిక చేసాడట. చరణ్ కూడా చాలా రోజుల నుంచి త్రివిక్రమ్ తో మంచి కథ దొరికితే చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు పవన్ ఈ కాంబినేషన్ ని సెట్ చేయడంతో చరణ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్ తో ‘అ..ఆ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చరణ్ కూడా తని ఒరువన్ రీమేక్ తర్వాత ఈ సినిమాని మొదలు పెడతాడు. వీరిద్దరూ ఈ రెండు సినిమాలు ఫినిష్ చేసాక, ఎక్కువ భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు