“ఆచార్య” టీజర్ పై మరో క్రేజీ గాసిప్..!

Published on Jan 28, 2021 7:01 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎట్టకేలకు రాబోతుంది. ఈ జనవరి 29న విడుదలకు రెడీ కాబోతున్న ఈ సాలిడ్ టీజర్ పై మరిన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి ఈ లేటెస్ట్ సమాచారం ప్రకారం దాదాపు ఈ టీజర్ ఒక నిమిషం15 సెకన్ల మేర ఉండనున్నట్టు తెలుస్తుంది. మరి అలాగే పవర్ ఫుల్ సిద్ధ గా రామ్ చరణ్ తన వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా చిన్న బిట్ లో కూడా కనిపిస్తాడని టాక్..అది కూడా జస్ట్ అలా చివర్లో. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ లో ఈ అంశాలు ఉంటాయా లేదా అన్నది చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More