‘గుంటూరు కారం’ ఈవెంట్ పై క్రేజీ గాసిప్

‘గుంటూరు కారం’ ఈవెంట్ పై క్రేజీ గాసిప్

Published on Jan 7, 2024 8:24 PM IST

guntur kaaram 4

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగనుంది, అదే విషయాన్ని ఈవెంట్ నిర్వాహకులు ధృవీకరించారు. ఐతే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కాబోతున్నారని పుకార్లు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ ‘హనుమాన్’ సినిమా ఈవెంట్ కి హాజరు అవుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ సినిమా ఈవెంట్ కి కూడా మెగాస్టార్ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఐతే, మెగాస్టార్ ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం లేదు.

కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 12, 2024న విడుదల కానుంది.

తాజా వార్తలు