మరో లెవెల్లో శంకర్ – చరణ్ భారీ సినిమా.?

మరో లెవెల్లో శంకర్ – చరణ్ భారీ సినిమా.?

Published on Feb 24, 2021 8:08 PM IST


ఈ మధ్య మన ఇండియన్ సినిమా నుంచి ప్రకటితం కాబడిన భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబో కూడా ఒకటి. అయితే మరి ఈ సినిమా అనౌన్సమెంట్ నుంచే తారా స్థాయి అంచనాలు కూడా సెట్ అయ్యిపోయాయి. అందుకు తోడు ఈ చిత్రాన్ని ఒక స్కై ఫై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తారని మరో టాక్ రావడంతో ఆ అంచనాలు మరింత స్థాయిలో పెరిగాయి. కానీ గత రెండు మూడు రోజుల నుంచి ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రాన్ని ఒక్క పాన్ ఇండియన్ లెవెల్ సినిమాగా కాకుండా పాన్ ఆసియన్ లెవెల్ సినిమాగా శంకర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది. ఇప్పుడు తాను చేస్తున్న “భారతీయుడు 2” సినిమాలో చేస్తున్న కొరియన్ నటి బే సూజి ఇందులో నటిస్తుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ చిత్రం పాన్ ఆసియన్ ప్రాజెక్ట్ అయ్యిందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఈ టాక్ నడుస్తుంది. ఇక ఈ భారీ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ఏ లెవెల్లో తెరకెక్కిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు