విజయ్ దేవరకొండ సరసన క్రేజీ హీరోయిన్

విజయ్ దేవరకొండ సరసన క్రేజీ హీరోయిన్

Published on Aug 14, 2018 12:16 PM IST

vijay2

విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ విడుదలకు సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, విజయ్ మాత్రం వరస చిత్రాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ షూటింగ్ మొదలుపెట్టేసిన విజయ్ సెప్టెంబరు నుండి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం డేట్లు కేటాయించనున్నాడు. రొమాంటింక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామరావు నిర్మిస్తున్నారు.

కాగా గత కొన్ని నెలలుగా క్రాంతి మాధవ్ మరియు కె.ఎస్ రామారావు ఇద్దరూ విజయ్ సరసన నటించే హీరోయిన్ని వెతికే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కథ పరంగా చాలా ముఖ్యమైనదట. హీరో పాత్రకు సమానంగా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నాను హీరోయిన్ పాత్ర కోసం తీసుకోనున్నారని సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజా వార్తలు