పవన్, సురేందర్ రెడ్డిల ప్రాజెక్ట్ కు క్రేజీ లైన్.?

Published on Sep 27, 2020 9:22 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత పవన్ మరో మూడు చిత్రాలు లైన్ లో పెట్టుకున్నాడు. అయితే వీటిలో ఒక్కోటి సెపరేట్ అంచనాలను నెలకొపుకున్నాయి.

అయితే వీటిలో ఊహించని విధంగా అనౌన్స్ చేసిన చిత్రం సురేందర్ రెడ్డితో ప్రాజెక్ట్. ఇక ఈ ఇద్దరి కాంబోలో చిత్రం అనగానే మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అప్పుడే ఎదురు చూపులు మొదలయ్యాయి. అయితే ఇపుడు ఈ ప్రాజెక్ట్ లైన్ కు సంబంధించి ఆసక్తికర బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని ఒక ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించనున్నారట. అలాగే ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉండే అవకాశం ఉన్నట్టు టాక్. మరి ఈ పవర్ అండ్ స్టైలిష్ కాంబో ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More