ఒకే సినిమాలో హీరోయిన్స్ గా శివాని, శివాత్మిక.

ఒకే సినిమాలో హీరోయిన్స్ గా శివాని, శివాత్మిక.

Published on Jun 7, 2020 5:29 PM IST

Shivai

హీరో రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిన్న కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో వెండితెరపై తళుక్కున మెరిసింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా గత ఏడాది విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఒక దొరసాని పాత్రలో శివాత్మిక మొదటి చిత్రంలోనే అద్భుత నటనతో కట్టిపడేసింది. ఇక పెద్ద కూతురు శివాని ప్రస్తుతం ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

శివాని, శివాత్మిక కంటే ముందే వెండితెరకు పరిచయం కావాల్సింది. ఆమె డెబ్యూ మూవీ టూ స్టేట్స్ మధ్యలో ఆగిపోవడంతో ఆమె ఎంట్రీ లేటైంది. తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ పై వచ్చింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్న నూతన చిత్రంలో వీరిద్దరూ కలిసి హీరోయిన్స్ గా నటించనున్నారట. ఈ మూవీకి నిర్మాత జీవిత రాజశేఖర్ కాగా, ఆ సినిమాలో హీరోయిన్స్ గా అక్కా చెల్లెళ్ళు కలిసి నటించనున్నారని వినికిడి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

తాజా వార్తలు